ETV Bharat / state

నిర్లక్ష్యం విలువ రూ. 2.50 కోట్లు - undefined

రెండున్నర కోట్ల నిధులు సక్రమంగా వినియోగిస్తే 2 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. వంద మందికి ఆర్థిక చేయూత కల్పించవచ్చు. కానీ కందుకూరులో అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం వృథాగా పోతోంది.

ప్రజాధనం వృథా
author img

By

Published : Feb 18, 2019, 6:07 AM IST

పది వేలతో కొన్న ఫోన్... మొదటి రోజే పేలిపోతే ఎంత బాధగా ఉంటుంది. లక్ష పెట్టి కొన్న బైక్‌ని మొదటి రోజే ఎవరైనా దొంగిలిస్తే ఎంత కోపం వస్తుంది. డబ్బులు... కొన్న వస్తువు పోయిందనే ఆవేదన ఉంటుంది. ఈ లెక్క ప్రభుత్వ అధికారుల దగ్గరకి వస్తే మాత్రం మారిపోతుంది. ఎంత ప్రజాధనం వృథా అయిన వారికి సూది గుచ్చుకున్నంత బాధ ఉండదు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన పార్కు, కొలనే దీనికి తార్కాణం.

ప్రజాధనం వృథా
undefined

కొలను పాలైన కోటి రూపాయలు
పురపాలక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈత కొలనులు కేవలం రెండు, మూడు చోట్లే ఉన్నవి. కందుకూరులోని కొలను వీటిలో ఒకటి. 2014 సంవత్సరంలో సుమారు 75 లక్షల రూపాయలతో నిర్మించారు. అదనంగా మరో 40 లక్షలు ఖర్చుతో ప్రహరీగోడ, ఇతర హంగులు సమకూర్చి...నిర్వహణ ఓ లీజుదారుడికి ఇచ్చారు. కొన్నాళ్లు పట్టణ ప్రజలతో సందడిగా ఉన్నా... వచ్చిన సొమ్మును సంబంధిత గుత్తేదారు... పురపాలికకు చెల్లించలేదు. పోయింది ప్రజల సొమ్మే కదా అని అధికారులు పట్టించుకోలేదు. ఆర్థిక కారణాలు చూపిన సదరు గుత్తేదారుడు నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఈత కొలను ఇలా మూత పడింది.

పశువుల మైదానంలా పార్కు
ఈతకొలనుకు ఆనుకొని దాదాపు ఐదున్నర ఎకరాల్లో ఉద్యాన వనం కోసం నిధులు మంజూరు చేసారు. పార్క్‌లో కార్యాలయం, వాకింగ్‌ ట్రాక్‌, ఆధునిక విద్యుత్తు దీపాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఇవి పూర్తి కాకుండానే కోటి రూపాయలతో ప్రహరీ నిర్మించారు. పార్క్‌ లోపల పనులు మాత్రం పూర్తి కాలేదు. పిచ్చిమొక్కలు పెరిగి, పశువుల మైదానంలా తయారైంది ఆ ప్రాంతం. కోట్ల రూపాయల నిధులు ప్రజలకు ఉపయోగపడక పోగా ఇలా వృథాగా పోతున్నాయి.

ఇవి కూడా చూడండి:

విశాఖ తీరాన బాహుబలి యంత్రం

New Delhi (Feb 17) ANI: Speaking on Congress president Rahul Gandhi's tweet that 'Make in India needs a serious rethink', Union minister of railways Piyush Goyal on Sunday said that it's very unfortunate that he has attacked a flagship programme that doesn't belong to a political party but to the people of India. Goyal said, "Make in India is all about Indian self-reliance. It's all about Indian technical knowledge, the efforts that our workers do to produce goods in India. I feel sorry that Rahul Gandhi hasn't recognised that for the first time India has indigenously developed a train set which barely a few countries in the world made and that too in just 18 months."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.