ETV Bharat / state

దర్శి వైకాపాలో బయటపడ్డ వర్గ పోరు - ప్రకాశం దర్శిలో వైకాపాలో వర్గ విబేధాలు న్యూస్

ప్రకాశం జిల్లా దర్శి వైకాపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ రోజు జరిగిన వైఎస్సాఆర్​ వర్ధంతిలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అనుచర వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

దర్శిలో వైకాపా వర్గ విబేధాలు
దర్శిలో వైకాపా వర్గ విబేధాలు
author img

By

Published : Sep 2, 2020, 6:57 PM IST

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా దర్శిలోని గడియారం స్తంభం సెంటర్​లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మెుదట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమైన దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వస్తున్నట్లు సమాచారం రావటంతో ఆయన అనుచరవర్గం అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఉండటంతో అనుచరవర్గం వ్యతిరేకవర్గంతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడనుంచి వ్యతిరేక వర్గాన్ని పంపించారు. తదుపరి ఎమ్మెల్యే వచ్చి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గతంలో ముండ్లమూరులో...

వైఎస్సార్ జయంతి సందర్భంగా గతంలో ముండ్లమూరు బస్టాండ్ సెంటర్​లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ముందుగా వ్యతిరేక వర్గం పూలమాలలు వేసి కేక్ కట్​చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్​తో కార్యక్రమం నిర్వహిచాలని ఎమ్మెల్యే అనుచర వర్గం చూసింది. కానీ వ్యతిరేక వర్గం రాత్రి 12 గంటల వరకు విగ్రహం చెంతకు వారిని చేరనీయలేదు. మరుసటి రోజు బందోబస్తు మధ్య వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఇదీ చదవండి: రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.