ETV Bharat / state

కొవిడ్​ కేర్​ సెంటర్లను పరిశీలించిన నోడల్ అధికారి - ongole latest news

కొవిడ్​ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్​.. వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్​ ఆస్పత్రి, ట్రిపుల్​ ఐటీలోని కొవిడ్​ కేర్​ సెంటర్లను ఆయన పరిశీలించారు.

covid care center
కొవిడ్​ కేర్​ సెంటర్లను పరిశీలిస్తున్న అధికారులు
author img

By

Published : May 13, 2021, 11:21 PM IST

కొవిడ్ కేర్ సెంటర్లో వైద్యులు, నర్సులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ అన్నారు. కొవిడ్​ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్​ ఆస్పత్రి, ట్రిపుల్​ ఐటీలోని కొవిడ్​ కేర్​ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం.. భోజన సౌకర్యాలు కల్పించాలని ఆయన చెప్పారు.

రోగులు వేచిచూడకుండా వీలైనంత త్వరగా వారికి ఆస్పత్రిలో పడకలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కృష్ణవేణి, బీసీ సంక్షేమశాఖ అధికారి, కొవిడ్​ కేర్​ సెంటర్​ నోడల్​ ఆఫీసర్ శ్రీ ఎం.వెంకటేశ్వర రావు, రిమ్స్ హాస్పిటల్ సూపరిండెంట్ డా. శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీకాల కొనుగోళ్లకు గ్లోబల్‌ టెండర్‌: అనిల్‌ సింఘాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.