స్వాతంత్య్ర వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జి మంత్రి పి. విశ్వరూప్ పతకావిష్కరణ చేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు సత్వర పూర్తికి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్దార్థ కౌశల్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు ప్రదర్శించారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొని, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రత్యేక గౌరవం దక్కింది... గత ఐదు నెలలుగా సేవా దృక్పథంతో నిరంతరం పనిచేస్తున్న వీరు ధన్యులని ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్ అన్నారు. పారిశుద్ద్య కార్యికులు, వైద్యాధికారులు, నర్సులు, ల్యాబ్ సహాయకులు, ఎఎన్ఎమ్లు తదితర సిబ్బందిని శాలువలతో సన్మానించారు.
ఇదీ చూడండి