దర్శిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఫలితంగా.. కొవిడ్-19 నిబంధనలు కఠినంగా అమలుపరచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇటీవల 65 ఏళ్ల వృద్దుడు కరోనాతో మృతి చెందాడు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శి పరిధిలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలుపరిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తహసీల్ధారు వరకుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: