ప్రకాశం జిల్లాలో ఉల్లిపాయల ధరలు కొండెక్కాయి... మహారాష్ట్ర, ఇండోర్ తదితర ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో వచ్చే ఉల్లి దిగుబడులు తగ్గిపోయాయి... అదే సమయంలో జిల్లాలోని త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, బల్లికురువ, పెద్దారవీడు ప్రాంతాల్లో గత ఖరీఫ్ లో 810 ఎకరాల్లో మాత్రమే ఉల్లిసాగయింది. రబీకి ఒకటి రెండు చోట్ల రైతులు మొగ్గుచూపినా వర్షాల వల్ల సాగుచేయలేకపోయారు. దీంతో కిలో ఉల్లి ధరలు అమాంతంగా 100 రూపాయలకు చేరింది. ప్రకాశం జిల్లాలో దాదాపు 9 లక్షల కుటుంబాలుండగా ఒక్కో దానికి నెలకు సరాసరి 5 కిలోలు అవసరమవుతాయి. పదిరోజుల క్రితం కిలో ఉల్లి 40 రూపాయలుండగా నెలవారి ఖర్చు రూ.200 ఉండేది. ప్రస్తుతం పెరిగిన ఉల్లిధర కారణంగా అదనంగా కిలోకు 60 రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుంది
చీరాలలో కిలో ఉల్లిధర రూ.100 ఉంది. దీంతో ఒక్కో కుటుంబంపై నెలకు 300 రూపాయల చొప్పున మొత్తం వినియోగదారులపై నెలకు 27 కోట్లరూపాయలు ఆదనపుభారం పడుతుంది. వర్షాల కారణంగా ప్రస్తుతం ఉల్లిధరలు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలపై దృష్టి సారించిన మార్కెటింగ్ విభాగం జిల్లా కు మొదటి విడతగా 40 టన్నుల తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. అవి ఎప్పుడు రైతుబజార్లలో రాయితీపై పంపిణీ చేస్తారోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి