పురపోరు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇంచార్జీ బాచిన కృష్ణచైతన్య, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య పాల్గొని.. గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
19 వార్డులో వైకాపా అభ్యర్థి నాగరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: