ETV Bharat / state

గోవా మద్యం స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్ - గోవా నుంచి తరలించిన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు

ప్రకాశం జిల్లాలో.. గోవా నుంచి తరలించిన అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గోవాలో పనిచేసిన ఓ వ్యక్తి.. అక్కడినుంచి జిల్లాకు మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు.. నిందితులను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు.

liquor
liquor
author img

By

Published : May 3, 2021, 4:53 PM IST

గోవాకు చెందిన కల్తీ మద్యాన్ని.. ప్రకాశం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. పెద్దారవీడు మండలంలో తనీఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. కర్రోల గ్రామంలోని మిరప పొలాల్లో దాచిఉంచిన 1,175 మద్యం సీసాలతో పాటు రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్ట్ చేశారు.

గోవా నుంచి తీసుకువచ్చి

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మణంపాడుకు చెందిన సేవా నాయక్ అనే యువకుడిని.. ప్రధాన నిందితునిగా పోలీసులు తేల్చారు. ఇతను గతంలో గోవాలో ఉండి అక్కడ పనులు చేసిన అనుభవంతో... మద్యాన్ని తీసుకువచ్చి.. ప్రకాశం జిల్లాలో విక్రయిస్తున్నాడని.. జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు. సీసాలో ఉన్న మద్యం కూడా నకిలీ మద్యంగా భావిస్తున్నామని ఆయన వివరించారు.

సొంతగా తయారు చేసిన లేబుల్ స్టిక్కర్లు

కుంట, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట పట్టణాల్లో ఈ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. మద్యం సీసాలపై సొంతగా తయారు చేసిన లేబుల్ స్టిక్కర్లను వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మద్యాన్ని నెల రోజులు తాగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసులకే షాకిచ్చిన నిందితుడు

15 రోజులుగా పెద్దారవీడు మండలంలో నిఘా ఉంచి నకిలీ మద్యాన్ని గుర్తించినట్లు ఇన్​స్పెక్టర్ తిరుపతయ్య తెలిపారు. ఓ ఇన్ఫార్మర్ ద్వారా తామే రూ.3.5 లక్షల విలువగల మద్యం కావాలని అడగ్గా.. సాయంత్రం లోగా సమకూరుస్తామని తెలపగా.. ఎక్సైజ్ పోలీసుల సైతం ఆశ్చర్యపోయారు. ఒక్కో మద్యం సీసా ధర మాత్రం రూ.160 అని.. ధర మాత్రం తగ్గించేది లేదని పోలీసులకు తెలిపారు. అలా నిందితులు అధికారులకు పట్టుబడ్డారు. గోవా నుంచి మద్యం సరఫరా చేసే మరో వ్యక్తిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ నిందితుల వెనుక మార్కాపురం ఎక్సైజ్ పోలీసుల పాత్ర ఉన్నట్లు.. మొదటి ముద్దాయి సేవా నాయక్.. మార్కాపురం లోని ఏ1 గ్లోబల్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

మా వాళ్లు ఎలా ఉన్నారో..? రోగుల బంధువుల్లో ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.