ETV Bharat / state

చీరాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు - Illegal sand excavations in chirala

ప్రకాశం జిల్లా చీరాలలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతోంది. ఇవి బహిరంగంగానే జరుగుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Illegal sand excavations
ఇసుక అక్రమతవ్వకాలు
author img

By

Published : Apr 25, 2021, 9:42 AM IST

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారు. కడవకుదురు, పందిళ్లపల్లి, దేశాయిపేట, వేటపాలెం, ఈపురూపాలెం ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ సమీపంలోనే ఈ దందా చేస్తున్నారు. ఈ కారణంగా ట్రాక్ కుంగిపోయే ప్రమాదంతో, పాటు భూగర్భ జలాలకు ముప్పుతప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పండిళ్లపల్లిలో రైల్వే ట్రాక్​ను అనుకుని 10 అడుగులకు ఇసుక తవ్వేసి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఈ ప్రాంతం సమీపంలో తనకు వారసత్వంగా వచ్చిన పొలం నుండి ఓ వ్యక్తి అక్రమంగా ఇసుకతవ్వి ధనం ఆర్జిస్తున్నారు. దీనిపై తిరుమల సాంబయ్య అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ అదేరోజున చీరాల గ్రామీణ సీఐకి ఫిర్యాదు పంపారు. ఇరవై రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ విషయంపై తాను మెడికల్​ లీవ్​లో ఉండి.. మూడురోజుల క్రితమే విధుల్లో చేరానని సీఐ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. సాంకేతిక విద్యాభివృద్ధికి అనంతపురం జేఎన్​టీయూ కృషి భేష్: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.