పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీపీఐ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రేపు ఉద్ధండరాయుని పాలెంలో సీపీఐ నాయకులు చేపట్టనున్న ర్యాలీ, బహిరంగ సభ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. నేతలు ఎవరూ సభకు హాజరుకాకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారిపై పలు ఆంక్షలు విధించారు.
సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలను అడ్డుకోవటం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం అవివేకమన్నారు. భవిష్యత్తులో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఏలూరు వింత వ్యాధికి పురుగుమందులే కారణం..!