ETV Bharat / state

ఆ విద్యార్థులకు ఏమైంది.. 8 రోజులు ఎక్కడున్నారు? - ప్రకాశంలో ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి న్యూస్

వసతి గృహ అధికారులేమో.. ఇంటికి వెళ్లారనుకున్నారు.. తల్లిదండ్రులేమో.. హాస్టల్​లోనే ఉన్నారుకున్నారు. వచ్చి చూసిన తండ్రికి మాత్రం విద్యార్థులు కనిపించలేదు. ఇంతకీ ఆ పిల్లల పరిస్థితి ఏమైంది? హాస్టల్​ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లాలనుకున్నారు ? అసలేమైంది..?

hostel students died news in prakasham
author img

By

Published : Oct 27, 2019, 12:14 PM IST

ఆ విద్యార్థులకు అదే చివరి సరదా అయింది!

ఆ ఇద్దరు విద్యార్థులు చనిపోయారన్న సంగతి వసతి గృహ అధికారులకు.. తల్లిదండ్రులకూ తెలియదు. ఓ విద్యార్థి తండ్రి వసతి గృహంలో చదువుకుంటున్న కొడుకును పలకరించాలని వచ్చాడు. కానీ... ఆ తండ్రికి వసతి గృహ అధికారులు చెప్పిన మాటలు విని ఏం జరిగిందో అర్థం కాలేదు. తన బిడ్డ హస్టల్​లోనే ఉన్నాడంటూ.. ఇంటికి రాలేదంటూ ఆందోళన చెందాడు. అనంతరం ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు భయంకరమైన చేదు నిజం బయటపడింది.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం వేలూరు పంచాయతీ పరిధిలోని టి.సల్లూరు గ్రామానికి చెందిన ఇండ్లా సూర్యం (13), నల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన చిన్నపు రెడ్డి బ్రహ్మారెడ్డి(12) చీమకుర్తిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ... ప్రభుత్వపాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీన సెలవు పత్రం ఇచ్చి ఇంటికి బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యం చేరకుండానే ముగిసిపోయింది. ఇంటికి వెళ్తూ.. సరదాగా ఈత కొడదామని తరచూ స్నానం చేసే మూసీ వాగులోకి దిగారు. అదే వారికి ఆఖరి సరదా అయింది.

తండ్రి ఫిర్యాదు మేరకు పొదిలి, చీమకుర్తి, మర్రిపూడి పోలీసులు మూసీ వాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. మధ్యాహ్నం సమయానికి ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. అది బ్రహ్మారెడ్డిదిగా గుర్తించారు. అక్కడనుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వాగు మధ్యలో సూర్యం మృతదేహాన్ని గుర్తించారు. ఎనిమిది రోజుల తర్వాత వారిని కనుగొన్నారు. పక్కపక్కనే ఉన్న రెండు గ్రామాల్లోని విద్యార్థులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:మిస్టరీ వీడిన దంపతుల హత్య కేసు... ఐదుగురు అరెస్టు

Intro:స్లగ్:- AP_ONG_51_27_STUDENTS DEATH_AVB_AP10136 text
కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509.

ముసివాగు మింగేసింది. వసతి గృహ అధికారులు ...ఆయిద్దరువిద్యార్ధులు ఇళ్లకు వెళ్లారనుకున్నారు.విద్యార్ధుల తల్లి,తండ్రులు తమ బిడ్డలు వసతి గృహంలో క్షేమంగా చదువుకుంటున్నారు అనితలచారు...కానీ ఆ ఇద్దరు విద్యార్ధులు చనిపోయారన్న సంగతి వసతి గృహ అధికారులుకుగాని,తల్లితండ్రులకు గాని తెలియదు.ఓ విద్యార్ధి తండ్రి చీమకుర్తి పనిమీద వచ్చి వసతి గృహంలో చదువుకుంటున్న కొడుకును పలకరించి వెళదాము అని,ఖర్చులకు డబ్బులు ఇచ్చినట్లు ఉంటుందని వసతి గృహం వద్దకు వెళ్ళాడు.కానీ అక్కడ అతనికి వసతిగృహ అధికారులు మీ పిల్లవాడు ఎనిమిదిరోజుల కిందట సెలవు చీటి ఇచ్చి ఇంటికి వచ్చాడు అనే పిడుగులాంటి వార్త చెప్పటంతో కంగారు పడుతూ మా బిడ్డ ఇక్కడే ఉన్నాడు ఇంటికి రాలేదంటూ ఆందోళన చెందాడు.అనంతరం చీమకుర్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో గాలింపు చేర్యాలు చేపట్టారు.చివరకు గాలింపులో ఇద్దరు విద్యార్ధులు ముసివాగులో మృత దేహాలై కనిపించారు.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసిండి.వివరాలలోకి వెళితే.........
ప్రకాశంజిల్లా పొదిలిమండలం వేలూరు పంచాయతీ పర్ధిలోని టి.సల్లూరు గ్రామానికి చెందిన ఇండ్లా. సూర్యం (13),నల్లా రెడ్డి పాలెం గ్రామానికి చెందిన చిన్నపు రెడ్డి.బ్రహ్మ రెడ్డి(12)చీమకుర్తిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వపాఠశాలలో ఆరవ తరగతి చదువుకుంటున్నారు.ఈ నెల 19వ తేదీన సెలవు పత్రం ఇచ్చి ఇంటికి బయలుదేరారు.కానీ వారి ప్రయాణం గమ్యం చేరకుండానే నిలిచిపోయింది.ఇంటికి వెళుతూ సరదాగా ఈతకొడదామని వారు తరచూ జలకాలాడే ముసి వాగులోకి వెళ్లారు.అదే వారికి ఆఖరి సరదా అయింది.
తండ్రి ఫిర్యాదు మేరకు పొదిలి,చీమకుర్తి,మర్రిపూడి పోలీసులు శనివారం ఉదయం నుండి ముసి వాగు చుట్టూ,చుట్టూ పక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున గాలించారు.మద్యహాన్నం సమయానికి ఓ మృత దేహాన్ని కనుగొన్నారు అది బ్రహ్మా రెడ్డిదిగా గుర్తించారు.అక్కడనుండి రెండు కిలోమీటర్ల దూరంలో నది మద్యలో తేలాడుతున్న మరో మృత దేహాన్ని గుర్తించి అది సూర్యం ది గా గుర్తించారు. పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలలోని విద్యార్ధులు మృత్యువాత పడటంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బైట్:- కొండయ్య విద్యార్ధి సూర్య తండ్రి
సురేష్ ఎస్సై పొదిలి.Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి 9848450509.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.