ETV Bharat / state

రేపల్లె అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి - బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

HOME MINISTER CONSOLE: రేపల్లె అత్యాచార బాధితురాలిని హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కానందువల్ల ఆకతాయిలకు భయం లేకనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

HOME MINISTER
రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
author img

By

Published : May 2, 2022, 2:31 PM IST

Updated : May 2, 2022, 4:50 PM IST

HOME MINISTER CONSOLE: ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రేపల్లె అత్యాచార బాధితురాలిని హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కానందువల్ల ఆకతాయిలకు భయం లేకనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని....హోంమంత్రి తానేటి వనిత అన్నారు. బిల్లును కేంద్రం ఆమోదించకపోవడమే ఇందుకు కారణమని ఉద్ఘాటించారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని మంత్రి సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రి కాన్వాయ్‌ను ఒంగోలు రిమ్స్‌ వద్ద తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు.

రేపల్లె అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుంది

"బాధితురాలు జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చుకుని వెళ్లి హింసించారు... ఇతరుల సాయం కోసం భర్త అందరినీ ప్రాధేయపడ్డారు. ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్​ స్టేషన్‌కు వెళ్లారు. సమాచారం అందుకోగానే పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి ఒంటిగంటకు ఫిర్యాదు రాగానే.. ఉదయం 7 గంటలకు నిందితులను పట్టుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. పోలీసులు వెళ్లడం ఆలస్యమైతే ఇంకా దారుణం జరిగేది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితులను వదిలిపెట్టేది లేదు.. కఠినంగా శిక్షిస్తాం. బాధితులకు రూ.8 లక్షలు ఆర్థికసాయం అందిస్తాం. ఇప్పటికే రూ.4 లక్షలు ఆర్థికసాయం అందించాం" -తానేటి వనిత, హోంమంత్రి

హోంమంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్న తెలుగుదేశం మహిళ నేతలు

హోంమంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్న తెలుగుదేశం మహిళ నేతలు: రేపల్లె అత్యాచార ఘటన బాధితురాలిని పరామర్శించేందుకు ఒంగోలు వచ్చిన హోంమంత్రి తానేటి వనితను తెలుగుదేశం మహిళ నేతలు అడ్డుకున్నారు.మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. కొంతసేపు మంత్రి కాన్వాయ్‌ ఆగిపోయిది. పోలీసులు అక్కడికి వచ్చి మహిళలను చెదరగొట్టారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా మహిళలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది . తోపులాటలో ఒకరు సొమ్మసిల్లి పడి పోయారు.

ఇదీ చదవండి: Rape Attempt: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

Last Updated : May 2, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.