కబడ్డీ క్రీడాకారిణి రోడ్డు ప్రమాదంలో మంచానికే పరిమితం కావడం బాధాకరమని హైకోర్టు న్యాయవాది జఢా శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో ఆయన పర్యటించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్న క్రీడాకారిణి అఖిలను పరామర్శించారు.
న్యాయవాది మాట్లాడుతూ.. అఖిలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల ఆర్థిక సహాయం, పక్కా గృహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోపు ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: