ప్రకాశం జిల్లా చీరాలలో చేనేత జన సమైక్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు ఆహార భద్రత కల్పించటంలో విఫలమయ్యాయని రాష్ట్ర చేనేత జన సమాఖ్య ప్రతినిధులు విమర్శించారు. చేనేత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కూలీలకు, చేతి వృత్తుల వారికి నెలకు రూ.3000/-లు చొప్పున 6 నెలలపాటు వారి అకౌంట్లో జమ చేయాలని చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు డిమాండ్ చేశారు.
రూ.200 కోట్ల మూలధనం నిధిని ఏర్పాటు చేసి ఉత్పత్తి - కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి జీవనోపాధికి భరోసా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోహనరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో సంస్థకు ఉన్న బకాయి రూ.176 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలన్నారు. చేనేత కార్మికులు, సహకార సంఘాల బకాయిలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర చేనేత జనసమైఖ్య అధ్యక్షులు దేవన వీర నాగేశ్వరరావు, కర్ణ హనుమంతరావు, సజ్జా పవన్ కుమార్, గుంటూరు మాల్లికార్జున్, కర్ణ కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: