ప్రకాశం జిల్లా కనిగిరిలో విపరీతమైన గాలివాన అతలాకుతులం చేసింది. భారీ చెట్లు, ఇళ్ల పైకప్పులు నెలకొరిగాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హనుమంతునిపాడు మండలం మోరవారిపల్లి గ్రామ పరిసర పొలాల్లో విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి చుట్టుకు పోయి నిప్పురవ్వలు పడి జామాయిల్ తోట దగ్దమైంది. వెలిగండ్ల మండలంలోని గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. చంద్రశేఖరపురం మండలంలోని గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు చంద్రశేఖరపురంలోని శివాలయంలో ధ్వజస్తంభం విరిగి పడింది.
ఇదీ చూడండి యర్రగొండపాలెంలో నాటుసారా అక్రమ దందాపై చర్యలు