ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురవటంతో పంట పొలాల్లోని ధాన్యమంతా తడిచిపోయింది. దర్శి, ముండ్లమూరులో అకాలవర్షానికి పంటలు నీటమునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం రూపంలో నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిరప రాసుల కింద నీరు చేరింది. కప్పిన పరదాలపై వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. మరోవైపు దర్శి పట్టణంలో మురుగుకాలువలోని నీరు రోడ్లపైకి చేరటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చదవండి