ప్రకాశం జిల్లా ఒంగోలులోని నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో విధులు ముగించుకొని తిరుగు ప్రయాణవుతున్న వై.నాగరాజు అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. వేటపాలెం గ్రామానికి చెెందిని నాగరాజు... ఒంగోలులో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వేటపాలెంకు ప్రయాణిస్తున్నాడు.
చదలవాడ గ్రామం సమీపంలో... అటుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం, నాగరాజు వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శశికుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: