ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హనుమాన్ జయంతి వేడుకలు శోభాయమానంగా జరిగాయి. కోనేటి వీధిలోని శ్రీ సువర్చలసాహిత ప్రసన్నాంజనేయ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవాలయంలోని హనుమ విగ్రహాన్ని 5 లక్షల 15 వేల రూపాయల విలువ గల 100, 50 నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఇవీ చదవండి...ప్రసన్నాంజనేయుడుకి ప్రత్యేక పూజలు