ETV Bharat / state

రూ.85 కోట్ల జీఎస్టీ ఎగవేత ఘటనలో నిందితుల పట్టివేత

నకిలీ గ్రానైట్ వ్యాపారం పేరుతో ప్రభుత్వాన్ని మోసగించిన నలుగురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి,వారి నుంచి ద్రవపత్రాలను తీసుుకుని ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు.

రూ.85 కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారు
author img

By

Published : Sep 17, 2019, 6:51 PM IST

రూ.85 కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారు

ప్రకాశం జిల్లాలో జీఎస్టీ ఎగవేతదారుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్రానైట్ వ్యాపారం పేరుతో నకిలీ పత్రాలను సృష్టించిన వ్యాపారులు సుబ్బారావు, రమేశ్ , గౌరీనాయుడు, మహేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి, వారి వద్ద నుంచి ధ్రువపత్రాలను సేకరించి..ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 278 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి, ఆ కంపెనీలకు సంబంధించి18,239 బిల్లులను తయారు చేశారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఇందుకోసం మార్టూరు ప్రాంతంలో నకిలీ డోరు నంబర్లు తయారుచేశారని వెల్లడించారు. దీంతో మొత్తం రూ.85 కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారని తెలిపారు.

ఇదీ చదవండి :

బాలుడి కిడ్నాప్...ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Intro:ap_knl_101_17_varadha_chikkukunna_av_ap10054 ఆళ్లగడ్డ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవర్గం చాగలమర్రి మండలం లో వకిలేరు లో ఇద్ద రు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు నేలంపాడు కు చెందిన నరసయ్య దావీదు అనే ఇద్దరు ఏటికి ఆవల ఉన్న గొర్రెల కాపరులకు భోజనం తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా వరద ఉధృతి పెరిగింది ఇద్దరూ బయటికి రాలేక హాహాకారాలు చేయడం తో దూరంగా ఉన్న రైతులు వీరిని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందించారు వీరిని కాపాడేందుకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు ప్రస్తుతం వారిని కాపాడే పనిలో ఉన్నారుBody:చాగలమరి వద్ద వరదల్లో చిక్కుకున్న గొర్రెలకాపరులుConclusion:వరదలు గొర్రెల కాపరులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.