ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గొల్లపల్లి కటిక వెంకటేశ్వర్లు అనే రైతుకు ఉన్న భూమిలో కొంత కబ్జాకు గురైంది. రాజకీయ నాయకులే ఈ దురాక్రమణకు పాల్పడ్డారని వెంకటేశ్వర్లు ఆందోళనకు దిగారు. ఆర్టీవో కార్యాలయాన్ని వేదికగా చేసుకొని గళం వినిపించాడు. నల్లని వస్త్రంపై కబ్జాకు సంబంధించిన వివరాలు రాసి పెట్టి ఆందోళన చేపట్టాడు. తనకున్న 34 ఎకరాల్లో ఓ ఎకరాం ఆక్రమించారని.. అడిగితే బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఆర్డీఓ శేషురెడ్డికి విన్నవించుకున్నారు.
త్రిపురాంతకంలో భూమి కబ్జా చేశారంటూ... ఓ సామాన్యుడి వినూత్న నిరసన - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గొల్లపల్లి కటిక వెంకటేశ్వర్లు అనే రైతు తన భూమిని రాజకీయనాయకులు కబ్జా చేశారని ఆర్డీఓ కార్యలయం ఎదుట నిరసన తెలిపారు.