పేదలకు ఇళ్ల స్థలాలు పంచేందుకు.. అందుబాటులో ఉన్న స్థలాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు, రాజుగారిపాలెం, బొబ్బేపల్లిలో.. ప్రత్యేక అధికారి గంగాధర్ గౌడ్ పర్యటించారు. మార్టూరు తహసీల్దార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అర్హులైన వారందరికీ నివాస స్థలాలు ఇవ్వటమే తమ లక్ష్యంగా చెప్పారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతోనే.. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: