ETV Bharat / state

అనాథ శవానికి అంత్యక్రియలు.. మానవత్వం చాటుకున్న ఆపద్బంధు ప్రతినిధులు - covid deaths news

కరోనా పాజిటివ్​ కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయి. కొవిడ్​తో మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు వెనకడుగు వేస్తున్నారు. అనాథల పరిస్థితి మరీ దయనీయం. అలాంటి వారికి అంత్యక్రియలు చేస్తూ..మానవత్వం చాటుతున్నారు ఆపద్బంధు సంస్థ ప్రతినిధులు.

Funeral for an orphan
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆపద్బంధు ప్రతినిధులు
author img

By

Published : May 2, 2021, 11:13 AM IST

కొవిడ్​తో ఎంతో మంది మరణిస్తున్నారు. అందరూ ఉన్నా.. అనాథలుగా అంత్యక్రియలు చేయాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందారు. ఇతనికి బంధువులు ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న ఆపద్బంధు ప్రతినిధులు.. ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోటానికి తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: జీజీహెచ్​కు కొనసాగుతున్న కొవిడ్ రోగుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.