ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పంచాయతీలోని కొత్త పాలెం గ్రామంలో క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి క్లిష్ట సమయంలో యువత ముందుకు వచ్చి గ్రామంలోని వారికి పంపిణీ చేయటం ప్రశంశనీయమని పలువురు అభినందించారు. సుమారు 15 వేల రూపాయల వ్యయంతో కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు దాతలు తెలియజేశారు.
ఇది చూడండి తేలికపాటి వర్షం... మిర్చి రైతుల ఆందోళన