Jaibheem Bharat App: ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా జైభీమ్ భారత్ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చని.. 24 గంటల్లో తమ బృందం వచ్చి న్యాయసహకారం అందిస్తుందని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ అన్నారు. ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన పార్టీ బహుజన శంఖారావం సభలో ఈ యాప్‌ను ఆయన ప్రారంభించారు. వైద్యుడు సుధాకర్ రాజకీయ హత్య దగ్గర నుంచి సీఎం జగన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జైభీమ్ భారత్ పార్టీ వల్ల ప్రతి నియోజకవర్గంలో 5-6 వేల ఓట్లు గండిపడతాయని హెచ్చరించారు. తమ సభకు అనుమతి ఇవ్వకుండా నిర్బంధాలు పెట్టాలనుకున్నారని.. హైకోర్టు అనుమతితో నిర్వహించినట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిరోముండనం బాధితుడు వరప్రసాద్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకే పోలీసులు తనకు శిరోముండనం చేసి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జక్కంపూడి రాజాపై వరప్రసాద్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. హత్యకు గురైన కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసులను ఆశ్రయించినా మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి: