ప్రకాశం జిల్లాలో...
లాక్డౌన్ సమయంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇండియన్ రెడ్‌క్రాస్ ప్రతినిధులు వారికి ఆపన్నహస్తం అందించారు. ప్రకాశం జిల్లా చీరాల, కొత్తపేటలో దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. భౌతికదూరం పాటిస్తూ సరకులు పంపిణీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
నరసాపురంలో గత కొన్ని రోజులుగా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఫొటోగ్రాఫర్లకు సీనియర్ న్యాయవాది చదలవాడ జ్ఞాన ప్రకాష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పని లేని సమయాన.. రోజు గడవడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.
ఇదీచదవండి.