ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని చక్రాయపాలెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల మండలం గోవిందాపల్లికి చెందిన ఒక కుటుంబం కర్మకాండలకు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండిమాండుగుల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కి తరలించారు.
ఇవీ చూడండి...
వాగులు, చెరువులో ఇంకిపోయిన నీళ్లు.. దిక్కుతోచని స్థితిలో రైతులు