ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామ సమీప పొలాల్లో.. తెగిపడి వున్న విద్యుత్ తీగలు తగిలి మాలకొండయ్య అనే రైతుకు చెందిన 5 గేదెలు మృత్యువాతపడ్డాయి. రోజు మాదిరిగానే తనకున్న 5 గేదెలను మేతకోసం పొలంలోకి మాలకొండయ్య తోలుకుపోయాడు. గేదెలు మేత మేసే క్రమంలో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాయి.
తన కళ్ల ముందే గేదెలు విలవిల్లాడుతున్నా.. ఏమీ చేయలేని స్థితిలో మాలకొండయ్య ఉండిపోయాడు. తనకు జీవనాధారమైన పశువులు మృత్యువాత పడటం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. గేదేల విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులను శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఇదీ చదవండి: