ETV Bharat / state

జిల్లా మత్స్యశాఖకు చేరిన చేపల వేట వివాదం.. సామరస్యంగా పరిష్కరిస్తామన్న జేడీ - fishermen protest at District Fisheries Department in ongole

సముద్రంలో వేట సాగించే విషయంలో మత్స్యకారుల్లో రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం మత్స్యశాఖ జిల్లా కేంద్రానికి చేరింది. ఒకరిపై మరోకరు పిర్యాదు చేసుకోడానికి మత్స్యశాఖ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇరువర్గాలను సమస్యలు విన్న జేడీ.. వివాదాలకు పోవద్దని, సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Conflict between two communities of fishermen
జిల్లా మత్స్యశాఖకు చేరిన చేపల వేట వివాదం
author img

By

Published : Dec 2, 2020, 8:52 PM IST

ప్రకాశం జిల్లాలో ఎన్నాళ్లనుంచో సముద్రంలో చేపల వేట విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల నాయకులు ఒంగోలులో మత్స్యశాఖ జాయింట్‌ డైరక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వాళ్లు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు. మత్స్యకారులు తమ సమస్యలను జేడీ చంద్రశేఖరరెడ్డికి విన్నారు. వాళ్ల సమస్యలను నిశితంగా విన్న జేడీ ఇరువర్గాలను శాంతింపజేశారు. వివాదాలకు పోవద్దని, సామరస్యంగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇలా మొదలైంది..

బల్ల వలలు ద్వారా ఒక వర్గం, ఐలా వలలు ద్వారా మరో వర్గం వేట సాగిస్తున్నారు. ఈ విధానం వల్ల చేపలు గుడ్లు పెట్టే ప్రాంతంలో వేట సాగిస్తున్నరని, దీని వల్ల సంతానోత్పత్తికి విఘాతం ఏర్పడతుందని ఒక వర్గం వాదిస్తే, ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు మేరకే వేట సాగిస్తున్నామని రెండు వర్గం చెబుతోంది. మత్స్యకారుల సంఘాలు, పెద్దలు కనుసన్నల్లో వేట సాగుతుందని, చట్టాలు ఏం చేస్తున్నాయని ఒకరు. సముద్రంలో వేటకు వెళితే మధ్యలో దౌర్జన్యంగా మత్స్య సంపదను దోచుకుంటున్నారని మరోకరి ఆరోపణలు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తుంది.

ఇదీ చదవండి:

'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్​ను కఠినంగా శిక్షించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.