ప్రకాశం జిల్లా సింగరకొండలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లి వీరాంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు. గోపాలపురానికి చెందిన చెలంచర్ల వీరంజనేయులు చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. సింగరకొండ భువనాసి చెరువులో వేటకు వెళ్లాడు.
వలను లాగే క్రమంలో అదుపు తప్పి చెరువులో పడిపోయాడు. ఆ వల అతని మెడకు చుట్టుకుంది. కాసేపటికి కొందరు జాల్లరు వచ్చి చూడగా.. విగత జీవిగా వలకు చిక్కి ఉన్నాడు. బయటకు తీసి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: