ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

author img

By

Published : Aug 27, 2020, 9:58 AM IST

చీరాల మండలం వాడరేవుకు చెందిన ఎం.పాండురంగారెడ్డి , డి.బ్రహ్మారెడ్డి ఇద్దరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. సుమారు 20 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లాక చేపల కోసం వల విసిరారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బోటు నుంచి జారి పాండురంగారెడ్డి సముద్రంలో పడిపోయారు.

fisher man
fisher man

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా వాడరేవు సముద్రం లో జరిగింది. చీరాల మండలం వాడరేవుకు చెందిన ఎం.పాండురంగారెడ్డి , డి.బ్రహ్మారెడ్డి ఇద్దరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. సుమారు 20 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లాక చేపల కోసం వల విసిరారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బోటు నుంచి జారి పాండురంగారెడ్డి సముద్రంలో పడిపోయారు. వెంటనే సమీపంలో ఉన్న మరో బోటులోని మత్స్యకారులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటిలో మునిగి పాండురంగారెడ్డి (34) మృతిచెందారు. వేటకు వెళ్లిన వ్యక్తి మృతిచెండంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామీణ సీఐ రోశయ్య, ఈపూరుపాలెం, మెరైన్‌ ఎస్సైలు వి.సుధాకర్‌, డి.ప్రసాద్‌, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: పేలిన సిలిండర్​- త్రుటిలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.