ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రుద్రయ్య స్థానిక బస్టాండ్ వద్ద పండ్ల దుకాణం నిర్వహిస్తుంటాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని ఇంట్లో మంటలు చెలరేగాయి. వ్యాపారం కోసం తెచ్చిపెట్టుకున్న పండ్లు కాలిపోయాయి. వంటగదిలో ఉన్న బియ్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని... మంటలు అదుపుచేశారు. సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెప్పారు.
ఇవీ చదవండి..