YCP two groups fight : ప్రకాశం జిల్లాలో వైసీపీలో వర్గ పోరు రోజురోజుకి పెరుగుతోంది... కొండెపి నియోజకవర్గంలోని వైసీపీ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరింది. పరస్పరం గొడవల కారణంగా కొండెపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికుటి అశోక బాబుపై.. మరో నాయకుడు వెంకయ్య వర్గం కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉంది. దీంతో అశోక్ బాబుపై పలుమార్లు సమావేశాలు పెట్టుకుని అసమ్మతి వెళ్లగక్కారు. ఒకరిపై ఒకరు సవాళ్లు కూడా విసురుకున్నారు. తనపై వెంకయ్య వర్గం లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ఆప్రతిష్టపాలు చేస్తున్నారని అశోక్ బాబు వర్గం ఈరోజు ప్రత్యక్ష చర్యలకు దిగారు.
వెంకయ్య వర్గానికి చెందిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బి. అరుణ ఇంటిపై అశోక్ బాబు, అతని అనుచరులు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. టంగుటూరులో ఉన్న అరుణ ఇంటికి ఈరోజు ఉదయం అశోక్ బాబు వర్గీయులు వచ్చి అరుణ కోసం ఆరా తీశారు. అయితే ఆమె అప్పుడు లేకపోవడంతో వెనుతిరిగారు. మళ్లీ మధ్యాహ్నం అరుణ ఇంటికి వచ్చారని తెలిసి.. అశోక్ బాబుతో పాటు మరికొందరు ఆమె ఇంటికి వచ్చి గొడవపడ్డారు... హల్చల్ చేశారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదంటూ అశోక్ బాబు, అతను వర్గీయులు తీవ్ర స్వరంతో వాగ్వాదానికి దిగారు.. అరుణ, ఆమె తల్లి అశోక్ బాబుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
ఇంట్లో ఉన్న పూల కుండీలు, కుర్చీలు అశోక్ వర్గీయులు ధ్వంసం చేశారు. అంతలో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అశోక్ బాబు వర్గీయులను అడ్డుకుని ఘర్షణ జరగకుండా చర్యలు చేపట్టారు. వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీలో వర్గపోరు మరింత బహిర్గతమైంది.
ఇవీ చదవండి :