పిడుగుపాటు ఆ కుటుంబంలో విషాదం నింపింది. పిడుగుపాటుకు తండ్రి, తనయుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రమణాలవారిపాలెంలో జరిగింది. వ్యవసాయ పొలానికి వెళ్లిన ఆ తండ్రి, కుమారులు తిరిగి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటారానగా ఒక్కసారిగా పడిన పిడుగు వారి ప్రాణాలను బలితీసుకుంది.
మాజీ సర్పంచి లోకిరెడ్డి నాగసేనారెడ్డి (48), ఆయన రెండో కుమారుడు శివశంకర్‌రెడ్డి (22) బుధవారం ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్లారు. పశుగ్రాసం కోసుకొని రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలో పిడుగు పడింది. ఒక్కసారిగా ఇద్దరూ కింద పడిపోయారు.
స్థానికులు గమనించి వారిని తొలుత గంగవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి చీమకుర్తిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం అగ్రికల్చరల్ బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: