ETV Bharat / state

గిట్టుబాటు ధర రాక.. కూలీలు లేక.. - ప్రకాశం జిల్లా కనిగిరిలో రైతుల ఇబ్బందులు

ప్రకాశం జిల్లా కనిగిరి మిర్చిపంటకు పెట్టింది పేరు. బోర్లను నమ్ముకుని సాగు చేసిన మిర్చి రైతులకు.. గిట్టుబాటు ధర రాక, కూలీల రేట్లు పెరగటంతో కన్నీరే మిగిలింది. పంటకు తెగులు పట్టటం.. మరోవైపు కూలీలను సైతం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

farmers suffer with rots in fields at prakasam
గిట్టుబాటు ధర రాక.. కూలీలు లేక..
author img

By

Published : Apr 2, 2021, 7:30 PM IST

గిట్టుబాటు ధర రాక రైతుల ఇబ్బందులు

పొలాల్లో ఒకవైపు తెగుళ్లు.. మరోవైపు కూలీల రేట్లు పెరగడంతో.. ఉద్యాన రైతులు నష్టాల బాట పట్టారు. గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.200 నుండి 300 వరకు కూలీ చెల్లించేవారు. కానీ, ఇప్పుడు కేవలం మధ్యాహ్నం వరకే రూ.300 చెల్లించాల్సి వస్తోందని.. సాయంత్రం పని చేయాలంటే మరో రూ.200 చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. కూలీలను సైతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి మిర్చిపంటకు పెట్టింది పేరు. బోర్లను నమ్ముకుని సాగు చేసిన మిర్చి రైతులకు.. గిట్టుబాటు ధర రాక కన్నీరే మిగిలింది. అరకొర వర్షాలతో కనిగిరి ప్రాంతంలో సాగు చేసిన అన్నదాతకు.. దిగుబడి కూడా అంత మాత్రంగానే వచ్చింది. దీనికితోడు పంటకు తెగులు పట్టడంతో.. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒక ఎకరా మిర్చి సాగుకు.. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెడితే 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కానీ, 18 క్వింటాళ్ల దిగుబడి రావడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులు తల్లడిల్లిపోతున్నారు. టమోటా రైతులు సైతం సరైన ధర లేక పండించిన పంటను చెట్లకే వదిలేస్తున్నారు. ప్రయోగాత్మకంగా క్యాప్సికం పంట వేసినా.. అరకొర ఆదాయమే తప్ప పంటకు లాభాలు రావటం లేదని రైతులు వాపోయారు.

ఇదీ చదవండి:

ఒంగోలు డెయిరీ మూత.. అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.