దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ప్రకాశం జిల్లాలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట స్థానిక రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో రైతు సంఘాలు, కాంగ్రెస్ నేతలు, వామపక్షాలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం చర్చి కూడలి వద్ద రాస్తోరోకో నిర్వహించారు.
ఇదీ చదవండి: నక్షత్ర తాబేళ్లను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు...