ETV Bharat / state

'దొండపందిళ్ల'... రైతులకు ఆనందహరివిల్లు

విత్తనం వేసిన దగ్గరనుండి కోతకోసేవరకు ఒక ఎకరా మిరపకు పెట్టుబడి పెట్టాలంటే ఎట్టా లేదన్నా సుమారు 40 నుండి 50 వేలు పెట్టాల్సిందే. అదే పత్తి పంటకైతే కొంచెం తగ్గుతుంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టినా పంట చేతికొస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వినూత్నంగా ఆలోచించారా గ్రామ రైతులు. ఒకసారి పెట్టుబడి పెట్టి.. నిత్యం ఆదాయం వచ్చే సాగును ఎంచుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఆ గ్రామాన్ని చుట్టుపక్కల వారంతా ఆ సాగు పేరుతోనే పిలుస్తారు.

author img

By

Published : Jan 6, 2020, 9:09 AM IST

farmers benifit for Ivy gourd crop(dhondakayya) in prakasham district
దొండపందిళ్లు ... లాభాలు ఫుల్లు
దొండపందిళ్లు ... లాభాలు ఫుల్లు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గాంధీనగర్​లో 50 రైతు కుటుంబాలు ఉన్నాయి. మిరప, పత్తి తదితర వాణిజ్య పంటలు తప్పా మిగతా పంటలు పెద్దగా తెలియదు ఆ రైతులకు. ప్రతి ఏడాది లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతుంటారు. అలాంటి పరుస్థితుల్లో ఉద్యావన శాఖ అధికారులు వారికి ఆపన్నహస్తంగా నిలిచారు. వారి సలహాలు సూచనలతో దొండ సాగు చేసేందుకు సిద్ధపడ్డారు. మొదట పదిమంది రైతులు మాత్రమే సాగు చేసేవారు. ఏడాదికి ఏడాదికి పెరుగుతూ ప్రస్తుతం ఆ గ్రామంలో దొండ పందిళ్లు సాగు చేసే రైతులు 45కు చేరారు.
పెట్టుబడి లేకపోయినా డోకా లేదు...
పెట్టుబడి ఒక్కసారి పెట్టినా మూడేళ్లు ఉండే సాగు కాబట్టి దిగుబడికి ఎలాంటి డోకా లేదని ఆ రైతులు చెప్తుతున్నారు. మొదట దొండ నాటిన తర్వాత రెండు నెలలు మాత్రమే వాటికి సపర్యలు చేయాలని.. పందిరిపై ఎక్కిన తర్వాత సంరక్షించాల్సిన అవసరం లేదని వారంటున్నారు.
ప్రభుత్వ ఆసరా....
పెట్టుబడి పెట్టినా ఉద్యానవంట కాబట్టి ప్రభుత్వం నుండి రాయితీ నగదు వస్తుండడంతో తమకు భారం అనిపించడం లేదంటున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు కోతకోస్తామని.. దీంతో నిత్యం తమ వద్ద నగదు ఉన్నటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భలే గిరాకి..
దగ్గర్లో మార్కాపురం, వినుకొండ మార్కెట్​ ఉండటంతో ఇబ్బంది పడాల్సిన పని లేదని చెబుతున్నారు. ఒక్కో బస్తాకు 300 వందల నుంచి 800 వందల వరకు అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు.చుట్టు పక్కల ఎలాంటి కార్యక్రమాలకైనా ఆ గ్రామం నుండే దొండకాయలు దిగుమతి చేసుకుంటారు.
వాణిజ్య పంటలకన్నా ఈ సాగే తమకు ఆదాయంగా ఉందని.. ప్రస్తుతం తమ గ్రామంలో 50 మంది రైతుల్లో 45 మంది రైతులు ఈ సాగే వేశామంటున్నారు. మా గ్రామాన్ని చూసి చుట్టూ పక్కల గ్రామాల వారు కూడా ఈ పంటపై మోగ్గుచుపుతున్నారన్నారు. ప్రస్తుతం తమ గ్రామాన్ని 'దొండపందిళ్ల గ్రామం'గా పిలుస్తున్నారని ఆనందంగా చెబుతున్నారు.
నిత్యం ఆ గ్రామానికి వెళ్లి వారికి సలహాలు సూచనలు చేస్తున్నామని ఉద్యానవన శాఖ అధికారులు చెప్తున్నారు.

ఇదీ చదవండి:

నీటిని పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

Intro:AP_ONG_81_04_JK_DONDA_SAAGU_PKG_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

విత్తనం వేసిన దగ్గరనుండి కోతకోసేవరకు ఒక ఎకరా మిరపకు పెట్టుబడి పెట్టాలంటే ఎట్టలేదన్నా సుమారు 40 నుండి 50 వేలు పెట్టాల్సిందే.......అదే పత్తి పంటకైతే కొంచెం తగ్గుతుంది.........వేళకు వేలు పెట్టుబడులు పెట్టినా పంట చేతికొస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వినూత్నంగా ఆలోచించారూ....ఆ గ్రామం రైతులు. పెట్టుబడి ఒకసారి పెట్టినా నిత్యం ఆదాయం వచ్చే సాగు ఎంచుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఆ గ్రామాన్ని చుట్టుపక్కల వారంతా ఆ సాగు పేరుతోనే పిలుస్తారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గాంధీనగర్ లో యాభై రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే మిరప, పత్తి తదితర వాణిజ్య పంటలు తప్పా మిగతా పంటలు పెద్దగా తెలియదు ఆ రైతులకు. ప్రతి ఏడాది లక్షలకు లక్షలు పెట్టుబడిలు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. అలాంటి పరుస్థితుల్లో ఉద్యావన శాఖ అధికారులు వారికి ఆపన్నహస్తంగా నిలిచారు. వారి సలహాలు సూచనలతో దొండ సాగు చేసేందుకు సిద్ధపడ్డారు. మొదట పదిమంది రైతులు మాత్రమే సాగు చేశారు. పెట్టుబడి ఒక్కసారి పెట్టినా మూడేళ్లు ఉండే సాగు కాబట్టి దిగుబడికి ఎలాంటి డోకా లేదని ఆ రైతులు చెబుతున్నారు. ఏడాదికి ఏడాదికి పెరుగుతూ ప్రస్తుతం ఆ గ్రామం లో దొండ పందిళ్లు సాగు చేసే రైతులు 45 కు చేరారు. మొదట దొండ నాటిన తర్వాత రెండు నెలలు మాత్రమే వాటికి సపర్యలు చేయాలని తర్వాత అవి పందిరి పై ఎక్కిన తర్వాత సంరక్షించాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. పెట్టుబడి పెట్టినా ఉద్యానవంట కాబట్టి ప్రభుత్వం నుండి రాయితీ నగదు వస్తుండడం తో తమకు భారం అనిపించడం లేదంటున్నారు. వారానికి రెండు లేదా మూడు సార్లు కోతకోస్తామని........దీంతో నిత్యం తమ వద్ద నగదు ఉన్నటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర్లో మార్కాపురం, వినుకొండ ఉండడంతో మార్కెట్ కు కూడా ఇబ్బందు పడాల్సిన పని లేదని చెబుతున్నారు. ఒక్కో బస్తా 300 వందల నుండి 800 వందల వరకు అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు. వాణిజ్య పంటలకన్నా ఈ సాగే తమకు ఆదాయంగా ఉందని......ప్రస్తుతం తమ గ్రామం లో 50 మంది రైతుల్లో 45 మంది రైతులం ఈ సాగే వేశామన్నారు. మా గ్రామాన్ని చూసి చుట్టూ పక్కల గ్రామాల వారు కూడా ఈ పంట పై ఇప్పుడిప్పుడే ఈ సాగు వైపు అడుగులు వేస్తున్నారని ఆ రైతులు అంటున్నారు. ప్రస్తుతం తమ గ్రామాన్ని దొండపందిళ్ల గ్రామంగా పిలుస్తున్నారని ఆనందంగా చెబుతున్నారు. చుట్టు పక్కల ఎలాంటి కార్యక్రమాలకైనా ఆ గ్రామం నుండే దొండకాయలు దిగుమతి చేసుకుంటారు.

నిత్యం ఆ గ్రామానికి వెళ్లి వారికి సలహాలు సూచనలు చేస్తున్నామని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.

బైట్స్: వెంకట నారాయణ....... రైతు.

వెంకటేశ్వర్లు....... రైతు.

వీరమ్మ...... రైతు

నాసరయ్య...... రైతు.

సుజాత........ కూలి

నాయబ్ రసూల్.....ఉద్యానవ శాఖ అధికారి.

నోట్..... ఎండింగ్ పిటూసి తప్పక వాడండి మేడం.....

Body:దొండపండిళ్ల గ్రామం.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.