ప్రకాశం జిల్లాలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దినాయునిపల్లిలో అప్పులు బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన సింగారెడ్డి సత్యనారాయణరెడ్డికి పదెకరాల పొలం ఉంది. ఆ భూమిలో నీరు కోసం దాదాపు 60 బోర్ల వరకు వేయించాడు. అయినా అరకొరగానే నీళ్లు పడ్డాయి. వీటికోసం దాదాపు రూ. 25లక్షల వరకు అప్పు చేశాడు.
ఈ ఏడాదైనా కాస్త లాభాలు వచ్చి అప్పులు తీరతాయనుకుంటే.. లాక్ డౌన్ కారణంగా అసలు పెట్టుబడైనా రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. అతని వద్ద దొరికిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం ఇదే మండలంలో దుద్యాల వెంకటేశ్వరరెడ్డి అనే రైతన్న రుణబాధలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇవీ చదవండి..