ETV Bharat / state

కరోనా బాధితుల కోసం.. మాజీ మంత్రి కుమారుడు 50 పడకల వితరణ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

కరోనా బాధితులను ఆదుకునేందుకు తమ వంత సాయంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్ 50 పడకలను అందించారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు శిద్దా కుటుంబ సభ్యులు తెలిపారు.

కరోనా బాధితుల కోసం 50 పడకలు అందజేసిన మాజీ మంత్రి కుమారుడు

author img

By

Published : May 13, 2021, 4:20 PM IST

కరోనా మహమ్మారి బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లభించక ఇబ్బందులు పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఆధ్వర్యంలో ఆయన కుమారుడు సుధీర్.. 50 పడకలను వితరణ చేశారు.

వీటిని ఒంగోలు జీజీహెచ్ వద్ద జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, ఆస్పత్రి సూపరింటెండెంట్​కు అందించారు. ఒంగోలు జీజీహెచ్​కు 20, దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి 20, చీమకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి మరో 10 పడకలను వాహనాల ద్వారా పంపించారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించి ఈ సాయం చేశామని శిద్దా కుటుంబీకులు చెప్పారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

మహారాష్ట్రలో ఇద్దరు మావోయిస్టులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.