ETV Bharat / state

కలెక్టరేట్​ వద్ద రైతు సంఘం నిరసన

author img

By

Published : Sep 7, 2020, 5:51 PM IST

తాము సాగు చేస్తున్న ఈనామ్ భూములు తమకు కాకుండా ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువులుకు అధికారులు ఇచ్చేశారంటూ... రైతులు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలానికి చెందిన మనేపల్లి రైతులు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఒంగోలు కలెక్టరేట్​ వద్ద రైతు సంఘం నిరసన
ఒంగోలు కలెక్టరేట్​ వద్ద రైతు సంఘం నిరసన

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మనేపల్లి గ్రామానికి చెందిన దళితులు, వెనుకబడిన వర్గాల వారు గత నలభై ఏళ్లుగా గ్రామంలోని సర్వే నెం 249లో 65 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువుల పేరిట 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్​ను రద్దు చేయాలని గత రెండు సంవత్సరాల నుంచి అధికారులకు పలు మార్లు విన్నవించుకున్నా.. ఫలితం ఏమీ లేదని వాపోయారు. తమ భూమిలో సజ్జ పంట సాగు చేస్తుండగా ఆ ప్రజాప్రతినిధి మనుషులు నాశనం చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై కేసు పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఆ గ్రామనికి చెందిన డిప్యూటీ తహసీల్దార్, మాజీ ప్రజా ప్రతినిధి కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈనామ్ చట్టం, హైకోర్టు తీర్పు ప్రకారం సాగు దారులు ఎవరైతే ఉన్నారో వారికే భూమి చెందాలి. అలా కాకుండా వేరే వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్​లు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చదవండి:

‘భూ’మంత్రకాళీ... కన్నేస్తే రాత్రికి రాత్రే కబ్జా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.