ప్రకాశం జిల్లా చీరాలలో నకిలీ ఇంటెలిజెన్స్ అధికారి రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.24 లక్షలు, 3 బంగారు బిస్కెట్ ముక్కలు, నాలుగు బంగారు గాజులు, రెండు బంగారు ఉంగరాలు, డమ్మి ఎయిర్ పిస్టల్, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చీరాల పట్టణంలోని బందావారి వీధికి చెందిన పాలువది రవితేజ బీటెక్ చదువు పూర్తిచేసి ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ నంటూ కొత్త అవతారం ఎత్తాడు. కస్టమ్స్ అధికారులు తెలుసంటూ తెనాలి బులియన్ మార్కెట్లో బంగారాన్ని కొనుగోలు చేసి తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేవాడు .ఇలా ఇచ్చే క్రమంలో కోట్ల రూపాయల నగదును వ్యాపారులు బంగారం కోసం రవితేజ అకౌంట్స్‌లో వేశారు. అనంతరం వ్యాపారులు నుంచి తప్పించుకుని తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన వ్యాపారి సాయిచంద్ర పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి