నాటుసారా స్దావరాలపై ఎక్సైజ్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు నాటు సారా తయారీ, విక్రయ స్థావరాలపై దాడులు చేశారు. భూమిలో పాతి పెట్టి ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయి తయారికీ వాడే కరక్కాయిలు, 5 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీపై గట్టి నిఘాపెట్టామని.. దీన్ని అణిచివేయటమే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చీరాల ఎక్సైజ్ సీఐ రమేష్ చెప్పారు. నాటుసారా తయారు చేసినా, అమ్మినా నిందితులకు 2 లక్షల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించేలా చేసిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు... విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి