ప్రకాశం జిల్లా చీరాల థామస్పేటకు చెందిన ఏరిచర్ల కిరణ్ కుమార్.. ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గతేడాది.. మాస్కు పెట్టుకోలేదని పోలీసులు విపరీతంగా కొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.
కిరణ్ మృతిచెంది ఏడాది గడిచినా.. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. నేటికి బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ లాక్ ఆప్ డేట్ అయితే ఆ కుటుంబానికి రూ. 30 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి జగన్ దళితులను హింసించి చంపేస్తున్నారనడానికి కిరణ్ కుమార్ ఘటనే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా బాధిత కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళితహక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేద్రం, వైకాపా నాయకుడు కరణం వెంకటేశ్, మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి.. : Son murdered father: రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేశాడు