ప్రకాశం జిల్లా మార్కాపురంలో పురపాలక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. వైకాపా నేతలు చేస్తున్న అరాచకాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా తమ ఛైర్మన్, వార్డు అభ్యర్థులను బెదిరిస్తూ.. ఆస్తులు కొల్లగొడతామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
నామినేషన్ ఉపసంహరణకు ఒక్క రోజు ముందు బెదిరింపులు మరింత పెరిగిపోయాయని నారాయణరెడ్డి తెలిపారు. చేసేదేమీ లేక తమ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదని... ఈ తరహా చర్యల వల్ల స్థానిక ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: