పాలనంతా అమరావతిలో జరుగుతుండగా మూడు రాజధానుల ఏర్పాటు మంచి పద్ధతి కాదని... మాజీమంత్రి సిద్దా రాఘవరావు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో... పరిపాలనను మూడుముక్కలుగా విభజిస్తే వైకాపా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తక్షణమే వెనక్కు తీసుకోవాలని సిద్దా రాఘవరావు డిమాండ్ చేశారు. అమరావతి ర్తెతులకు సంఘీభావంగా ప్రకాశం జిల్లా తెదేపా నేతలంతా తుళ్ళూరు వెళ్తామని తెదేపా నాయకుడు దామచర్ల జనార్ధన్ చెప్పారు.
ఇదీ చదవండి