ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. స్థానిక మోటార్ వెహికల్ తనిఖీ అధికారి అమర్ నాయక్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రావీణ్యం సాధించి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని అమర్ అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని యువకుల ప్రతిభను వెలికితీసేందుకు ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. బౌలింగ్... బ్యాటింగ్... ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఎవరికి వారు సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నారు. రెండు మైదానాల్లో రోజుకు ఆరు జట్ల తలపడుతున్నాయి. ఒంగోలుకు చెందిన శ్రీ చైతన్య భారతి డిగ్రీ కళాశాల... ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల కందుకూరు జట్టుపై చీరాల సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు 39 పరుగుల తేడాతో గెలిచింది.
ఇదీ చూడండి: