ETV Bharat / state

రెండు వర్గాల మధ్య పంచాయితీ.. ప్రార్థనా మందిరానికి తాళం..! - Kanigiri Durgam Baptist Church Locked

Kanigiri Durgam Baptist Church Locked: ప్రకాశం జిల్లా కనిగిరిలో రెండు క్రైస్తవ వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గం బాప్టిస్ట్ చర్చి కి తాళాలు పడేలా చేసింది.

Kanigiri Durgam Baptist Church Locked
రెండు వర్గాల మధ్య వివాదం... ప్రార్థనా మందిరానికి తాళం..
author img

By

Published : Feb 6, 2022, 3:01 PM IST

Kanigiri Durgam Baptist Church Locked: ప్రకాశం జిల్లా కనిగిరిలో రెండు క్రైస్తవ సంఘాల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గం బాప్టిస్ట్ చర్చి కి తాళాలు పడేలా చేసింది.

అసలేం జరిగిందంటే..?
కనిగిరిలో ఎంతో చరిత్ర కలిగిన దుర్గం బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు జరిగే సమయంలో రెండు క్రైస్తవ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ప్రార్థన నిమిత్తం పాస్టర్ ని నియమించడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక వర్గం వారు ఓ పాస్టర్ ని కొంత కాలం క్రితం ప్రార్థన చేయుటకు నియమించారు. కాగా.. మరో వర్గం వారు ఆ పాస్టర్ కి పదవి కాలం ముగిసిందని వెంటనే అతనిని తొలగించాలని పట్టుబట్టారు.

ఈ విషయంపై రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం.. చినికి చినికి గాలి వానలా మారింది. చివరకు పోలీస్ స్టేషన్ కి చేరింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ.. వివాదం ఎంతకీ సద్దుమణగక పోవడంతో చేసేది లేక ఇరువర్గాలను చర్చి నుంచి బయటకు పంపించి వేసి ప్రధాన ద్వారానికి పోలీసులు తాళాలు వేశారు.

ఇదీ చదవండి : Minister Perni Nani on State finance : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది: మంత్రి పేర్ని నాని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.