ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా పాజిటివ్ కేసు వచ్చిన నేపథ్యంలో పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దర్శి పట్టణంలోని బ్యాంకులు ఉదయం10గంటల నుంచి 12 గంటల వరకు తెరుస్తున్నారు. కేవలం 2గంటలు మాత్రమే పనిచేస్తుండటంతో ఖాతాదారులు 9 గంటల నుంచే బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద ఖాతాదారులకు ఎండ నుంచి ఉపశమనం కలిగేందుకు పానియాలు... కరోనా బారిన పడకుండా శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
దర్శిలోని ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం ఏ విధమైన ఏర్పాట్లు చేయలేదు. ఎండలో నిలబడలేక అల్లాడిపోతున్నామని పసిపిల్లల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భౌతికదూరం సంగతే మరిచారు. బ్యాంకువారు ఖాతాదారులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు'