లాక్డౌన్ కారణంగా పనులు లేక జీవనం కోల్పోయిన నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ప్రకాశం జిల్లా చీరాల, పేరాల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున డాక్టర్ హైమ సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో.. 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా.. జీవన భృతిని కోల్పోయినటువంటి నాయీ బ్రాహ్మణులకు.. నిత్యావసర సరుకులు అందించడం ఎంతో ఆనందంగా ఉందని దాతలు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: