కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, చిన్నగంజాం ప్రాంతాల్లోని రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, మద్యం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చదవండి: ఇంటికే పరిమితమవుదాం.. మహమ్మారిని తరిమికొడదాం