పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలని.. 1998 డీఎస్సీ అభ్యర్థులు గడియార స్తంభం కూడలి వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. గత 22 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు బాబు, అలీ, వెంకటేశ్వర్లు, హుస్నారా, సత్యం, రత్నబాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, పట్టణాధ్యక్షుడు రాజేష్, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్రా రామారావు తదితరులు మద్దతు తెలిపారు.